GNTR: ఫిరంగిపురం మండలం వేమూలూరిపాడు గ్రామంలో రాష్ట్రీయ గోకుల్ మిషన్ ఆధ్వర్యంలో, ఆంధ్రప్రదేశ్ పశుగణాభివృద్ధి సంస్థ , పశుసంవర్ధక శాఖ సంయుక్తంగా ఉచిత గర్భకోశ వ్యాధుల చికిత్స శిబిరం గురువారం నిర్వహించారు. ఈ శిబిరంలో పాడి పశువులకు గర్భకోశ వ్యాధులపై చికిత్స అందించి, అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు.