VSP: CII సుమ్మిట్లో భాగంగా గురువారం ఇండియా-యూరప్ బిజినెస్ పార్ట్నర్షిప్ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో CM చంద్రబాబు వేర్వేరు కంపెనీల ఛైర్మన్లు, సీఈవోలతో సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ.. విశాఖ అద్భుతమైన సాగర తీర నగరం అని, ఇక్కడ మంచి వనరులు ఉన్నాయన్నారు. ఏపీలో పెద్దఎత్తున పోర్టులను నిర్మిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.