ప్రకాశం: కనిగిరి పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఇవాళ పార్టీలో నూతనంగా నియమితులైన మండల, గ్రామ, క్లస్టర్, బూత్ స్థాయి అధ్యక్షులుగా నియమితులైన వారి ప్రమాణ స్వీకారం జరుగుతుందని ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి తెలిపారు. నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో ఇటీవల పార్టీ కమిటీలకు ఎంపికైన వారు తప్పనిసరిగా హాజరు కావాలన్నారు.