TG: ఢిల్లీ ఎర్రకోట వద్ద జరిగిన పేలుడుతో కేంద్రం అప్రమత్తమైంది. ఈ క్రమంలో HYDలో హై అలర్ట్ ప్రకటించింది. సున్నితమైన ప్రాంతాలను నగర పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకుంటున్నారు. కాగా, నిన్న దేశంలో ఉగ్రదాడులకు చేసిన కుట్రను గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అధికారులు భగ్నం చేయగా.. ఉగ్రకుట్రకు ప్లాన్ చేసిన వారిలో HYDకు చెందిన వ్యక్తి ఉన్న విషయం తెలిసిందే.