ELR: కొల్లేరు అభయారణ్యం సరిహద్దులను గుర్తించి నివేదిక సమర్పించాలని రాష్ట్ర అటవీ శాఖ చీఫ్ ప్రిన్సిపల్ కన్జర్వేటర్ చలపతిరావు అధికారులను ఆదేశించారు. ఏలూరు కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో గురువారం సమీక్షించారు. ఉప్పుటేరు సరిహద్దులను గుర్తించి నివేదికలు సమర్పించాలన్నారు. కొల్లేరు ప్రాంతాల్లో వరదలను నియంత్రించేందుకు ఆక్రమణలపై చర్యలు తీసుకుంటామన్నారు.