జనగామ జిల్లాలో ఆయిల్ పామ్ సాగు విస్తరణపై అధికారులు మరింత శ్రద్ధ చూపాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. 3500 మొక్కల లక్ష్యంలో ఇప్పటివరకు 1200 మొక్కల మంజూరు పూర్తయిందని తెలిపారు. ప్రతి PACS100 ఎకరాల లక్ష్యంతో రైతులను గుర్తించి అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఇప్పటికే జిల్లాలో 362 ఎకరాల్లో 715 టన్నుల దిగుబడిని సాధించినట్లు తెలిపారు.