NLG: రోడ్డు భద్రతను ప్రతి ఒక్కరు వ్యక్తిగత బాధ్యతగా తీసుకోవాలని కలెక్టర్ త్రిపాఠి అన్నారు. జిల్లా కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన రోడ్డు భద్రత జిల్లా స్థాయి సమావేశంలో మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు. అనంతరం ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ.. తమ శాఖ తరపున ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు.