నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఆమానుష ఘటన వెలుగు చూసింది. సబ్ జైలు రోడ్డులో కుక్క నోట్లో కరచుకుని నెలలు నిండని మృత శిశువు లభ్యమైంది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా మృత శిశువును ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆడశిశువు కావడంతో ఈ ఘటన పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. కాగా ఈ దారుణ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.