W.G: నరసాపురం ఎంపీడీవో కార్యాలయంలో ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఏర్పాటును పురస్కరించుకుని జరిపిన కార్యక్రమంలో ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ సోమవారం పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడారు. ప్రెస్ క్లబ్ ప్రతినిధులు జర్నలిజం ద్వారా సమాజానికి చేస్తున్న సేవ ఎంతో విలువైనదన్నారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తెచ్చి, పరిష్కార దిశగా నడిపించే పాత్ర మీది ఎంతో గొప్పదన్నారు.