అన్నమయ్య: చిట్వేల్ మండలంలోని నక్కలపల్లి గ్రామంలోని శ్రీ భవాని శంకర స్వామి దేవస్థానంలో కార్తీక మాసం 3వ సోమవారం పురస్కరించుకుని భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం అర్చకులు వేదమంత్రాల నడుమ స్వామివారికి సింధూరంతో విశేష అలంకరణ చేశారు.