MDK: ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ పార్థివదేహానికి మంత్రి దామోదర రాజనర్సింహ సోమవారం నివాళులు అర్పించారు. అందెశ్రీ భౌతికకాయం వద్ద పుష్పగుచ్చం ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. అందెశ్రీ మరణం తెలంగాణ సమాజానికి తీరని లోటు అన్నారు. తన మాట, పాటతో పేదల జీవితాలను కళ్లకు కట్టినట్టు చూపిన గొప్ప కవి అందెశ్రీ అని తెలిపారు.