KDP: ఎస్టీయూఏపీ రాష్ట్రోపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షునిగా వేంపల్లెకు చెందిన నర్రెడ్డి సంగమేశ్వర రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇందులో భాగంగా విద్యారంగంలో ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కృషి చేస్తానని ఆయన అన్నారు. అనంతరం సంఘం 79వ వార్షిక కౌన్సిల్ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు రెండేళ్లకు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.