HYD: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రానే వచ్చింది. ఇందుకు సంబంధించి అన్ని సిద్ధం చేసినట్లు అధికారులు వెల్లడించారు. రేపు ఉ. 7 గం.ల నుంచి సా. 6 గం.ల వరకు పోలింగ్ జరగనుంది. 407 పోలింగ్ కేంద్రాల వద్ద 2400 మంది పోలీసులతో పటిష్ట భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. నియోజకవర్గంలో 4.2 లక్షల ఓటర్లు ఉండగా.. 58 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.