MLG: పాము కాటు ఘటనపై డీఎంహెచ్వో ఎన్.గోపాల్ రావు ఇశాళ వివరణ ఇచ్చారు. పాము కాటుకు గురైన బాలుడిని స్థానిక పీహెచ్సీకి తరలించిన సందర్భంలో ఆసుపత్రిలో యాంటీ స్నేక్ వెనం (ASV)30 మోతాదులు అందుబాటులో ఉన్నాయన్నారు. బాలుడి కుటుంబ సభ్యులు సాంప్రదాయ వైద్యం వైపు మొగ్గు చూపడంలో జరిగిన జాప్యం వల్ల, వైద్య సంరక్షణ అందకపోవడంతో ప్రాణ నష్టం జరిగిందని వివరణలో తెలిపారు.