దేశ రాజధాని ఢిల్లీలో పేలుడు ఘటన బాధాకరమని ప్రధాని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు మోదీ సంతాపం తెలిపారు. ఈ ఘటనపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు మోదీ ఫోన్ చేశారు. ఢిల్లీ పేలుడుపై వివరాలు తెలుసుకున్నారు. ఐ20 కారులో పేలుడు జరిగిందని అమిత్ షా మోదీకి వివరించినట్లు సమాచారం.