ఢిల్లీలో పేలుడుపై అన్ని కోణాల్లో దర్యాప్తు జరుగుతోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. ‘I20 కారులో పేలుడు సంభవించింది. పేలుడు జరగగానే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. NIA, NSG బృందాలు దర్యాప్తు చేస్తున్నాయి. నేను త్వరలోనే పేలుడు ప్రాంతానికి వెళ్తాను’ అని షా చెప్పారు.