రామోజీ ఫిల్మ్ సిటీలో ఈనెల 15న మహేష్ బాబు ‘SSMB 29’ మూవీ ఈవెంట్ జరగనుంది. ఈ చిత్రంపై భారీ అంచనాల నేపథ్యంలో అభిమానులు పెద్ద సంఖ్యలో ఈవెంట్కు వచ్చే అవకాశం ఉంది. అయితే ఇటీవల పలుచోట్ల తొక్కిసలాటలు జరగడంతో అభిమానులు క్రమశిక్షణ పాటించాలి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిర్వాహకులు తగిన చర్యలు తీసుకోవాలి. కాగా, మహిళలు, చిన్న పిల్లలు ఈ ఈవెంట్కు దూరంగా ఉండటం ఉత్తమం.