ఢిల్లీ పేలుడు ఘటనలో గాయపడిన వారిని వెంటనే LNJP ఆస్పత్రికి తరలించారు. మొత్తం 15 మందిని ఆస్పత్రికి తీసుకురాగా, అందులో 8 మంది అప్పటికే చనిపోయారని ఆస్పత్రి సూపరింటెండెంట్ ధ్రువీకరించారు. క్షతగాత్రుల్లో ఇంకా ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని, వారికి చికిత్స అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. దీంతో పేలుడు కారణంగా మృతుల సంఖ్య పెరుగుతుందనే ఆందోళన వ్యక్తం అవుతోంది.