ఢిల్లీలో జరిగిన భారీ పేలుడు దుర్ఘటనలో మృతుల సంఖ్య పెరిగింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 13 మంది మృతి చెందగా, 30 మందికి తీవ్ర గాయాలు అయినట్లు సమాచారం. పేలుడు ధాటికి కొన్ని మృతదేహాలు ఛిద్రమయ్యాయని తెలుస్తోంది. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. పేలుడు జరిగిన ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రజలను అక్కడి నుంచి తరలించారు.