BDK: ఇల్లందు క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య ఇవాళ సమావేశం నిర్వహించారు. రైతును రాజును చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని MLA అన్నారు. అకాల వర్షాలతో రైతుల సమస్యలను దృష్టిలో ఉంచుకొని వారికి నష్టం జరగకుండా చర్యలు చేపట్టడం జరిగిందని, క్వింటా మొక్కజొన్నకు రూ.2400, క్వింటా వరికి రూ.2389 ధర నిర్ణయించి ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు.