ఢిల్లీలోని ఎర్రకోట వద్ద మెట్రో స్టేషన్ సమీపంలో జరిగిన భారీ పేలుడు ఘటనకు సంబంధించి పోలీసులు ఓ అనుమానితుడిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన వ్యక్తిని విచారిస్తున్నారు. పేలుడుకు గల కారణాలు, దీని వెనుక ఎవరి హస్తం ఉందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించే అవకాశం ఉంది.