సత్యసాయి: ముదిగుబ్బ మండలంలో గంజాయి విక్రయాన్ని అరికట్టేందుకు పోలీసులు సోమవారం విస్తృత దాడి నిర్వహించారు. ఈ సందర్భంగా మొత్తం 14 మంది యువకులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి 3 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ మహేష్ తెలిపారు. సీఐ శివరాముడు సిబ్బందితో కలిసి ఈ దాడిని చేపట్టగా ఆపరేషన్ను డీఎస్పీ పర్యవేక్షించారు.