VZM: జామి మండలం పీతలపాలెం జంక్షన్ వద్ద భీమసింగి నుంచి జామి వెళ్ళే రోడ్డులో రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్నట్లు స్థానికులు తెలిపారు. ఈ రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు కాగా వారిని విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించినట్లు వెల్లడించారు. గాయపడిన వారి వివరాలు తెలియాల్సి ఉంది.