TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 9 గంటల వరకు పోలింగ్ శాతం 9.1గా నమోదైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 4.01 లక్షల మంది ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. ఇందు కోసం 407 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం నుంచే ఓటర్లు బారులు తీరి వారి ఓటుహక్కును వినియోగించుకుంటున్నారు.