సత్యసాయి: ఆంధ్రప్రదేశ్ సగర/ఉప్పర వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్గా హిందూపురం జనసేన నాయకురాలు మణిప్రియ నియమితులయ్యారు. హిందూపురం నియోజకవర్గం నుంచి జనసేన తరఫున కీలక పాత్ర పోషిస్తున్న మణిప్రియను డైరెక్టర్గా ప్రభుత్వం నియమించడాన్ని పలువురు నాయకులు, కార్యకర్తలు స్వాగతించారు. ఈ నియామకం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు.