TG: కవి అందెశ్రీ అంతిమ యాత్ర ప్రారంభమైంది. లాలాపేట్ జయశంకర్ స్టేడియం నుంచి ఘట్కేసర్కు యాత్ర కొనసాగనుంది. తార్నాక, ఉప్పల్ మీదుగా ఘట్కేసర్లోని ఎన్ఎఫ్సీ నగర్‌కు యాత్ర నిర్వహించనున్నారు. అందె శ్రీ అంత్యక్రియలకు సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. ప్రభుత్వ లాంఛనాలతో అందెశ్రీ అంత్యక్రియలను జరపాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.