ఢిల్లీలో పేలుడుకు ఉపయోగించిన కారు పుల్వామాకు చెందిన వారు కొనుగోలు చేసినట్లు తేలడంతో దర్యాప్తు బృందాలు అప్రమత్తం అయ్యాయి. ఈ నేపథ్యంలో పుల్వామాలో ఆమిర్ రషీద్, ఉమర్ రషీద్ అనే సోదరులను పోలీసులు అరెస్ట్ చేశారు. కారు కొనుగోలు సమయంలో కీ తీసుకుంటున్న చిత్రం ఆమిర్దిగా గుర్తించారు. అయితే, తారిఖ్ అనే వ్యక్తి ఎవరో తమకు తెలియదని ఆ సోదరుల కుటుంబ సభ్యులు వెల్లడించారు.