నెటిజన్ల కనులకు కనువిందు చేస్తున్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్ సమీప ఫ్లెడ్బెర్గ్ పర్వతాలపై దట్టమైన పొగమంచు, మేఘాలతో మరో ప్రపంచం ఆవిష్కృతమైనట్లు కనిపిస్తుంది. దానిపై భవనాలు, ఇతర నిర్మాణాలు పొగమంచులో కనిపిస్తున్నాయి. ఈ ఫొటో చూసిన నెటిజన్లు సూపర్ ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.