ATP: గుంతకల్లు మున్సిపాలిటీలో ఇవాళ తెల్లవారుజామున పీహెచ్ వర్కర్స్ మస్టర్‌ను కమిషనర్ నయుం అహ్మద్ తనిఖీ చేశారు. అనంతరం కమిషనర్ సిబ్బంది హాజరు పట్టికలను పరిశీలించి, ఎంతమంది హాజరయ్యారు, ఎంతమంది గైర్హాజరయ్యారు వంటి వివరాల రికార్డు బుక్‌ను ఆయన పరిశీలించారు. ప్రజారోగ్యానికి భంగం కలిగించేలా విధుల్లో నిర్లక్ష్యం వరిస్తే చర్యలు తప్పవని సిబ్బందికి హెచ్చరించారు.