CTR: పుంగనూరు నియోజకవర్గం, రొంపిచర్ల మండలంలో జరిగిన సౌత్ జోన్ లెవెల్ వాలీబాల్ టోర్నమెంట్లో హైదరాబాద్ జట్టు విజేతగా నిలిచింది. సోమవారం రాత్రి జరిగిన ఫైనల్ పోరులో హైదరాబాద్ జట్టు, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ జట్టును 25-20, 25-22 పాయింట్లతో ఓడించింది. మూడో స్థానంలో పాండిచ్చేరి లోకేష్ జట్టు, నాలుగో స్థానంలో కాకినాడ జట్టు నిలిచాయి.