ఢిల్లీలో పేలుళ్లతో దేశవ్యాప్తంగా అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. అన్ని విమానాశ్రయాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు. మూడు రోజులపాటు ఎయిర్‌పోర్టుల్లో హై సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరినీ క్షుణ్ణంగా తనిఖీలు చేయాలని ఆదేశించారు. ఎయిర్‌పోర్టు పార్కింగ్‌పైనా దృష్టిపెట్టాలని స్పష్టం చేశారు.