కృష్ణా: గూడూరు మండలానికి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 15వ ఫైనాన్స్ నిధులతో మొత్తం ఆరు హెల్త్ సబ్సెంటర్లు మంజూరు చేసింది. మండలంలోని గూడూరు, ముక్కొల్లు, లేళ్ళ గురువు, కంకటావ, మల్లవోలు, ఆకలి మన్నాడు గ్రామాల్లో ఒక్కో హెల్త్ సెంటర్ భవన నిర్మాణం చేపట్టనున్నారు. ప్రతి భవనానికి రూ.34 లక్షల వ్యయం కేటాయించగా, త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి.