AP: భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా మంత్రి లోకేష్ ఆయనకు ఘననివాళులు అర్పించారు. ‘స్వాతంత్య్ర సమరయోధుడు కలాం.. వినూత్న సంస్కరణల ద్వారా దేశంలో విద్యాభివృద్ధికి విశేషంగా కృషి చేశారు. విద్యారంగానికి ఆయన చేసిన సేవలు ఎనలేనివి. ఆయన జయంతిని పురస్కరించుకుని జరుపుకుంటున్న మైనార్టీ సంక్షేమ దినోత్సవం, జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు’ అని పేర్కొన్నారు.