NZB: సాలూర మండలంలో ఇవాళ ఎలాంటి పర్మిషన్లు లేకుండా ఇసుకను తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను తహశీల్దార్ శశిభూషణ్ ఆదేశాల మేరకు అధికారులు పట్టుకున్నారు. పట్టుబడిన ట్రాక్టర్లను సాలూర ఎమ్మార్వో కార్యాలయానికి తరలించారు. తహశీల్దార్ శశిభూషణ్ మాట్లాడుతూ.. అనుమతులు లేకుండా ఎవరైనా అక్రమాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.