ఢిల్లీలో ఎర్రకోట సమీపంలో జరిగిన భారీ పేలుడు ఘటనలో 9 మంది మృతిచెందారు. మరో 20 మంది వరకు గాయపడ్డారు. ఘటనపై టీమిండియా హెడ్ కోచ్, ఈస్ట్ ఢిల్లీ మాజీ ఎంపీ గంభీర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘ఢిల్లీలో జరిగిన పేలుడు ఘటనలో ప్రాణనష్టం సంభవించడం బాధాకరం. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను’ అని పోస్ట్ పెట్టారు.