ఢిల్లీ పేలుడు కేసులో అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. జమ్మూకాశ్మీర్‌లో మరో ముగ్గురు అనుమానితులను పోలీసులు అరెస్ట్ చేశారు. రషీద్, మీర్, మాలిక్‌ను విచారిస్తున్నారు. అలాగే, కేసులు సంబంధించి డాక్టర్ ఉమర్ పాత్ర నిర్ధారణ కోసం DNA పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు అతడి కుటుంబ సభ్యుల నుంచి DNA నమూనాలు సేకరించారు. ఇప్పటికే పేలుడు ప్రదేశంలో శరీర భాగాలను గుర్తించారు.