GNTR: తెనాలిలో సుమారు రూ.2 కోట్లతో ఏర్పాటు చేస్తున్న ఫైకస్ థీమ్ పార్క్‌ను మంగళవారం మున్సిపల్ కమిషనర్ రామ అప్పలనాయుడు సందర్శించారు. పార్క్‌లో జరుగుతున్న లెవలింగ్ పనులను పరిశీలించి ఇంజనీరింగ్ అధికారులకు పలు సూచనలు చేశారు. పార్క్‌లో ఏర్పాటు చేయాల్సి పరికరాలు, లైటింగ్ వర్క్ తదితర అంశాల గురించి చర్చించారు. ఆలస్యం చేయకుండా సమయానికి పనులు పూర్తి చేయాలన్నారు.