BDK: చుంచుపల్లి మండల కేంద్రంలో ఎస్సై రవి ఆధ్వర్యంలో మంగళవారం ప్రజా చైతన్యం డ్రగ్స్ కార్యక్రమంలో భాగంగా బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కె షాబీర్ పాషా, మండల సీపీఐ కార్యదర్శి వాసిరెడ్డి మురళి పాల్గొని యువతతో ప్రసంగించారు. మత్తు పదార్థాలకు యువత బానిస కావొద్దని దానివల్ల అనేక నష్టాలు జరుగుతాయని వివరించారు.