SRD: సంగారెడ్డి పట్టణంలోని మైదానంలో క్రికెట్ పోటీలను టీజీఐఐసీ ఛైర్ పర్సన్ నిర్మల రెడ్డి మంగళవారం ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ.. యువకులకు క్రికెట్ పోటీలు నిర్వహించడం అభినందనీయమని చెప్పారు. క్రీడల్లో రాణించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజి అనంత కిషన్ పాల్గొన్నారు.