విశాఖ జిల్లా కోర్టు ఆవరణలో తెలుగు తల్లి విగ్రహం వద్ద వైసీపీ ఆధ్వర్యంలో మంగళవారం ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ చేశారు. ఈ కార్యక్రమంలో విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడు కె.కె.రాజు, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ కుమార్ పాల్గొన్నారు. రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వల్ల పేదలు విద్య, వైద్యం కోల్పోతారన్నారు.