ఢిల్లీ పేలుడు ఘటనలో డిటోనేటర్లను వినియోగించినట్లు అధికారులు వెల్లడించారు. వీటితోపాటు నిందితులు అమ్మోనియం నైట్రేట్ వంటి పలు ఇంధనాలను వాడినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని చెప్పారు. సోమవారం అమ్మోనియం నైట్రేట్, పొటాషియం నైట్రేట్ సహా సల్ఫర్‌తో కూడిన 2,900 కిలోల పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్న ఫరీదాబాద్‌లోని మాడ్యూల్‌కు ఈ పేలుడుతో సంబంధం ఉన్నట్లు తెలిపారు.