MBNR: ఈనెల 15న జడ్చర్లలోని నేతాజీ చౌరస్తాలో యాదవ సంఘం ఆధ్వర్యంలో సదర్ సమ్మేళన ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు ఇవాళ మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సదర్ సమ్మేళన ఉత్సవాలకు రావలసిందిగా ఆహ్వానించారు. అంతకుముందు ఆయనను శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం నేతలు పాల్గొన్నారు.