AP: అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైసీపీ నేత ఓబుళ్రెడ్డిపై దాడి జరిగింది. ఆయనపై దాడి చేసిన దుండగులు ముళ్లకంపల్లోకి తోసేశారు. జేసీ వర్గీయులే దాడి చేశారని ఓబుళ్రెడ్డి ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఖండించారు. ఇలాంటి దాడులు చేసిన వారికి చర్యలు తప్పవన్నారు.