MDK: లోక్ అదాలత్‌లో ప్రజలకు సత్వర న్యాయం అందించడానికి అవకాశం ఉందని మెదక్ జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈ నెల 15న జరిగే స్పెషల్ లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకొని రాజీ చేసుకోవాలన్నారు. లోక్ అదాలత్‌లతో త్వరితగతిన, తక్కువ ఖర్చుతో, ఇరువైపుల సమ్మతితో సమస్యలను పరిష్కరించుకునే అవకాశం ఉంటుందని తెలిపారు.