ఢిల్లీ పేలుడు ఘటన నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మరికాసేపట్లో ఉన్నత స్థాయి భద్రతా సమీక్ష నిర్వహించనున్నారు. సమావేశానికి కేంద్ర హోం శాఖ కార్యదర్శి, ఇంటెలిజెన్స్ చీఫ్, NIA డీజీ, ఢిల్లీ పోలీసు కమిషనర్ హాజరు కానున్నారు. జమ్మూకాశ్మీర్ డీజీపీ వర్చువల్గా పాల్గొననున్నారు. ఢిల్లీలో పేలుడు, కాశ్మీర్లో ఘటనలు, దేశంలో ఉగ్ర కుట్రలు వంటి అంశాలపై అమిత్ షా చర్చించనున్నారు.