బీబీసీకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ లేఖ రాశారు. అమెరికాలోని క్యాపిటల్ హిల్‌పై దాడి సందర్భంగా 2021లో ట్రంప్ చేసిన ప్రసంగాన్ని తప్పుడు అర్థం వచ్చేలా మార్చడంతో BBC చిక్కుల్లో పడింది. తన ప్రసంగాన్ని మార్చినందుకు పరిహారంగా బిలియన్ డాలర్లు చెల్లించాలని BBCకి ట్రంప్ లేఖ రాశారు. ఇందుకు శుక్రవారం వరకు గడువు ఇస్తున్నట్లు తెలిపారు. అయితే, ఈ లేఖను సమీక్షిస్తున్నట్లు BBC పేర్కొంది.