TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ నేపథ్యంలో నాన్ లోకల్ నేతలపై ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓటర్లను ప్రభావితం చేసే విధంగా తిరుగుతున్నారంటూ సీరియస్ అయ్యింది. ఈ మేరకు ఎమ్మెల్యేలు బీర్ల ఐలయ్య, రామచంద్రనాయక్‌తో పాటు ఎమ్మెల్సీ శంకర్ నాయక్‌పై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది.