VZM: రామభద్రపురం మండలంలో నూతనంగా మంజూరైన పక్కా గృహ నిర్మాణాల కొరకు గ్రామ పంచాయతీల్లో జియో ట్యాగింగ్ చేపడుతున్నామని మండల హౌసింగ్ అధికారి వెంకటేశ్ తెలిపారు. ఇవాళ బూసాయవలసలో ఇళ్ల నిర్మాణాలు పరిశీలించారు. మండలంలో 22 గ్రామ పంచాయతీల్లో ఇప్పటివరకు 1370 ఇళ్లు మంజూరయ్యాయన్నారు. ఇళ్లు మంజూరై దూరంగా ఉన్న వ్యక్తులు వెంటనే గ్రామాలకు రావాలన్నారు.