SRPT: నడిగూడెం మండలం కేశవాపురంలో మంగళవారం పాడి పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమాన్ని వైద్యాధికారి డా. రవికుమార్ ప్రారంభించారు. పశుపోషకులు పాడి పశువులకు, ఆవులకు, గేదెలకు సకాలంలో టీకాలు వేయించాలని సూచించారు. అలాగే పశువులకు ట్యాగింగ్ బిగించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గోపాలమిత్ర యాదగిరి, రామకృష్ణ, శ్రీను, రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు.