కొన్ని చిట్కాలతో కడుపు నొప్పిని తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఒక గిన్నెలో నీళ్లు తీసుకుని అందులో అల్లం వేసి బాగా మరిగించి.. వడకట్టి గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగాలి. ఇందులో తేనె కూడా కలుపుకోవచ్చు. లేదంటే పుదీనా ఆకులను తిన్నా లేదా నీటిలో మరిగించి తాగినా ఫలితం ఉంటుంది. నిమ్మ సోడా వాటర్, లవంగాలు, జీలకర్ర నీళ్లు వీటితో కడుపు నొప్పిని తగ్గించుకోవచ్చు.